![]() |
![]() |

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 దశాబ్దపు మైలురాయిగా రాబోతోంది. హోస్ట్ గా కింగ్ నాగార్జున మళ్ళీ కన్ఫమ్ అయ్యారు. మేకర్స్ ఈసారి దశావతారం అనే థీమ్ ను ప్రకటించారు. ట్యాగ్ లైన్ ఆటలో సవాల్ కాదు, ఈసారి ఆటే సవాల్ అని ప్రోమోలో చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారం గ్రాండ్ లాంచ్ ఉంటుందని స్టార్ మాలో, జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం. ఇది గత సీజన్ల కంటే పెద్దదిగా, టఫ్ టాస్క్ లతో ఉండబోతోందని అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెలబ్రిటీ లిస్ట్ లో ప్రధానంగా టీవీ, జబర్దస్త్, సోషల్ మీడియా స్టార్స్ ఉన్నారు. ఫైనల్ లిస్ట్ ఇంకా అఫీషియల్ గా రాలేదు కానీ బాగా వినిపిస్తున్న పేర్లు - పల్లవి గౌడ (సీరియల్ నటి), తేజస్విని గౌడ, ఎక్స్ ప్రెస్ హరి (జబర్దస్త్ కమెడియన్), రాకింగ్ రాకేష్, పండు మాస్టర్ (Dhee ఫేమ్ కొరియోగ్రాఫర్), ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందు, రాయల్ ఎంసీ రమణ, చంద్రహాస్ (ETV ప్రభాకర్ కొడుకు) వంటి వారు.
ఈసారి లిస్ట్ లో కొత్తగా గ్లామర్, విలన్ యాంగిల్ కూడా చేరింది. యాంకర్ వర్షిణి- జబర్దస్త్, పటాస్, ఢీ షోలతో ఫేమస్ అయిన ఆమె పేరు సెలబ్రిటీ కేటగిరీలో కన్ఫమ్ అని టాక్. అలాగే టాలీవుడ్ స్టార్ విలన్ టెంపర్ వంశీ (టెంపర్, భరత్ అనే నేను, వకీల్ సాబ్ ఫేమ్) కూడా హౌస్ లోకి వెళ్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇంకా దీపిక రంగరాజు, ఉప్పల్ బాలు, నూకరాజు, కడలి సత్యనారాయణ వంటి ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా లిస్ట్ లో ఉన్నారు.
ఈ సీజన్ హౌస్ డిజైన్ కూడా దశావతారం థీమ్ కు తగ్గట్టుగా పూర్తిగా మార్చారట. ప్రైజ్ మనీ 50 లక్షల నుండి 75 లక్షలకు పెంచుతారని టాక్ నడుస్తోంది. గత సీజన్ లో కామనర్ కళ్యాణ్ పడాల టైటిల్ కొట్టడంతో ఈసారి సెలబ్రిటీలు మరింత అగ్రెసివ్ గా ఆడతారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ లో ఇప్పటికే పల్లవి గౌడ, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ టాప్-5 రేస్ లో ఉంటారని అంచనా వేస్తున్నారు.
![]() |
![]() |